13న యురేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న లవ్ థ్రిల్లర్ -యురేక. కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్ సోసైల్ రియాన్, షాలిని ప్రధాన పాత్రలుగా కార్తీక్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ తాత నిర్మిస్తున్నారు. మార్చి 13న సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ -దర్శకుడు కార్తీక్ నటిస్తూ యువతతో తెరకెక్కించిన సినిమా యురేక. యూత్ చిత్రంగా కొత్తవాళ్లతో అద్భుతంగా తెరకెక్కించారు. 13న ప్రేక్షకుల ముందుకొస్తున్న చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ -కాలేజీలో జరిగే ఒక ఫంక్షన్‌లో చోటు చేసుకున్న సంఘటన ఆధారంగా సినిమా ఉంటుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు మంచి సహకారం అందించారు. 13న ఆడియన్స్ ముందుకుతెస్తున్న మా కష్టానికి తగిన ఫలితం అందిస్తారని ఆశిస్తున్నాం అన్నాడు. కార్యక్రమంలో హీరో సయ్యద్ సొహైల్ రియాన్, మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ మాట్లాడారు. నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ -యువత తలచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న మెసేజ్‌ను ఇందులో చూపిస్తున్నాం. ఒక మిస్టరీని దర్శకుడు కార్తీక్ అద్భుతంగా తెరకెక్కించాడు. కాలేజ్ నేపథ్యంగా వస్తోన్న సినిమా యూత్‌కి కనెక్టవుతుందనే అనుకుంటున్నా అన్నారు.