రెస్పెక్ట్ ఉమెన్ సీతాయణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ హీరో శశికుమార్ తనయుడు అక్షిత్, అనహిత భూషణ్ జోడీగా తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు ప్రభాకర్ ఆరిపాట తెరెకక్కిస్తోన్న చిత్రం -సీతాయణం. కలర్ క్లౌడ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్‌లో సినిమా నుంచి బుధవారం ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ -రెస్పెక్ట్ ఉమెన్ అన్న శీర్షికతో లవ్, క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, కన్నడతోపాటు తమిళంలోనూ అనువాద చిత్రంగా విడుదల చేయనున్నాం. బ్యాంకాంక్, బంగళూరు, మంగళూరు, ఆగుంబే, విశాఖపట్నం ప్రాంతాల్లో షూటింగ్ జరిపిన చిత్రంలోని పాటలు ఆకట్టుకుంటాయి. అద్భుతమైన క్లైమాక్స్ సినిమాను నెక్ట్స్‌లెవెల్‌లో నిలుపుతుంది. మార్చిలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు ఆరిపాక మాట్లాడుతూ -నేటి తరానికి నచ్చేలా హృద్యమైన అంశాలు, సన్నివేశాలతో రాసుకున్న కథ సీతాయణం. నిర్మాతల సహకారం, ఆర్టిస్టుల మంచి పెర్ఫార్మెన్స్‌తో అద్భుతంగా తెరకెక్కించాం. ఈ సినిమాతో అక్షిత్‌కు పెద్ద అవకాశాలు వస్తాయనే నమ్ముతున్నా. హీరోయిన్ అనహితతో కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది అన్నారు. చిత్రంలో అజయ్ ఘోష్, మధునందన్, విద్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ్భగవాన్, గుండు సుదర్శన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.