సెకెండ్ లుక్‌లో లెక్కల లవ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రేమకైనా వయసుకు తగ్గ లెక్కుంటుంది. ఒక్కో వయసుపై ఒక్కోలా ప్రేమ చూపించే ఇంపాక్ట్‌ని ఇతివృత్తం చేసుకుని దర్శకుడు మాడుపూరి కిరణ్‌కుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -15-18-24 లవ్ స్టోరీ. మాజేటి మూవీ మేకర్స్, కిరణ్ టాకీస్ బ్యానర్లపై నిర్మితమవుతున్న సినిమాకు స్రవంతి ప్రసాద్, కిరణ్‌కుమార్ నిర్మాతలు. బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల, కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే మెహ్రీన్ పీర్జాదా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సింగరకొండ ఆంజనేయస్వామి సన్నిధిలో సినిమా మూవీ పోస్టర్‌ను ఏపీ బీజేపీ ఆర్టిసన్ సెల్ కన్వీనర్ బంగారుబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -మాజేటి ప్రసాద్ నిర్మిస్తోన్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా. యువతరం మనసు గెలుచుకునే మంచి ప్రేమ కథను కిరణ్‌కుమార్ తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడిగా ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నా. సినిమాలో పాటలు బావున్నాయి అన్నారు. దర్శకుడు మాడుపూరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -కథానుగుణంగా కులుమనాలి, గోవా, ఒంగోలు, కేరళ, హైదరాబాద్ లోకేషన్స్‌లో షూటింగ్ జరిపాం. వైవిధ్యమైన కథా కథనాలతో సాగే చిత్రంలో భారీ యాక్సిడెంట్ హైలెట్‌గా నిలుస్తుంది అన్నారు. ఈ చిత్రానికి రాజేష్ గుడి సినిమాటోగ్రఫీ, జయవరదన్ సంగీతం సమకూరుస్తున్నారు.