ట్రెండ్‌సెట్టర్.. ప్రేమపిపాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీపీఎస్, కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షీ వర్మ హీరో హీరోయిన్లుగా దర్శకుడు మురళీ రామస్వామి తెరకెక్కించిన చిత్రం -ప్రేమపిపాసి. ఎస్‌ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్, యుగ క్రియేషన్స్‌పై రాహుల్ భాయ్ మీడియా, దుర్గశ్రీ ఫిలింస్ నిర్మించిన చిత్రానికి పిఎస్ రామకృష్ణ నిర్మాత. 13న సినిమా థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత పిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ -ప్రేమ పిపాసి ఓ ట్రెండ్ సెట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నామం. డైరెక్టర్ మురళి రామస్వామి, హీరో జీపీఎస్ వినిపించిన స్టోరీ బాగా నచ్చటంతో -రియల్ ఎస్టేట్ ఫీల్డ్ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ముగ్గురు మిత్రులతో కలిసి నిర్మించిన సినిమాను -దర్శకుడు ఎక్స్‌పెక్టేషన్స్‌కి మించి తీయడం హ్యాపీగా ఉంది. దర్శకుడు, హీరో.. టీం మొత్తానికి మంచి పేరొస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. ఆర్‌ఎక్స్ 100 సినిమా వచ్చినపుడు అర్జున్‌రెడ్డితో పోల్చారు. ఇప్పుడు ప్రేమపిపాసిని ఆర్‌ఎక్స్ 100లాంటి సినిమా అంటూ పోలుస్తున్నారు. సంతోషించే విషయమే అయినా, తరువాత వచ్చే ఇలాంటి చిత్రాలను ప్రేమపిపాసితో పోల్చడం ఖాయం అనిపిస్తోంది. ఎందుకంటే ఇది ట్రెండ్ సెట్ చేయడం ఖాయం అన్నారు. దర్శకుడు మురళీ రామస్వామి మాట్లాడుతూ -రెండేళ్ల జర్నీ ఈ సినిమా. హీరో జీపీఎస్ మంచి మిత్రుడు. పాత్ర కోసం అతన్ని రఫ్‌గా మేకోవర్ చేశాం. పెర్ఫార్మెన్స్‌తో సినిమాకు ప్రాణం పోశాడు. ఒక సినిమాకు ఏంకావాలో వాటిన్నింటి విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా చేస్తుండటం మరింత హ్యాపీనిస్తోంది. ఆర్స్ మ్యూజిక్, తిరుమల సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్.. ఇలా టెక్నీషియన్స్ టీం ఇచ్చిన సహకారాన్ని మర్చిపోలేను. జెన్యూన్ లవ్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో ప్రేమపిపాసిలో చూస్తారు అన్నాడు. హీరో జీపీఎస్ మాట్లాడుతూ -సినిమా కోసం టీం మొత్తం హార్డ్‌వర్క్ చేసింది. అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100 సినిమాలతో పోలుస్తున్నా -ప్రేమపిపాసి ఓ ట్రెండ్ సెట్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం. హీరోగా సినిమా గురించి నేను ఎక్కువ మాట్లాడకంటే -్థయేటర్లలో సినిమాయే మాట్లాడుతుందన్న నమ్మకంతో ఉన్నాను అన్నారు. మరో నిర్మాత రాహుల్ భాయ్ మాట్లాడుతూ -దర్శకుడు, హీరో సినిమాకు రెండు కళ్లుగా వర్క్ చేశారు. సాంగ్స్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ -ప్రేమపిపాసికి హైలెట్ అన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని గీత రచయితలు సురేష్ గంగుల, అలా రాజు, సినిమాటోగ్రాఫర్ తిరుమల రోడ్రిగ్జ్, హీరోయిన్లు కపిలాక్షి, సోనాక్షి వ్యక్తం చేశారు.