నాలో కాన్ఫిడెన్స్ పెంచిన యురేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్ నేపథ్యంలో కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్ సోహైల్ రియాన్, షాలిని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం -యురేక. హీరో కార్తీక్ ఆనంద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్‌పై ప్రశాంత్ తాత ఈ సినిమాని నిర్మించారు. 13న సినిమా విడుదలవుతున్న సందర్భంలో దర్శకుడు, హీరో కార్తీక్ ఆనంద్ మీడియాతో మాట్లాడారు.
* ప్రకాశం జిల్లా గిద్దలూరు మాది. హైదరాబాద్‌లో చదువుకున్నా. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ -సినిమాలపట్ల ఆసక్తితో చిన్న సినిమాలకు వర్క్ చేశాను. ఇప్పుడు -చిన్న యూనిట్‌తో యురేక తెరకెక్కించాను.
* కాలేజ్‌లో జరిగిన ఫంక్షన్ నేపథ్యంగా సినిమా ఉంటుంది. ట్రైలర్‌లోనే ఆ విషయాన్ని చెప్పేశాం. అలా జరిగే కాలేజ్ ఫెస్ట్ పేరే -యురేక. యూత్‌ఫుల్‌గా సినిమా కనుక -టైటిల్ అలా పెట్టాం.
* దీనికిముందు ఇండిపెండెంట్ అనే సినిమా మొదలుపెట్టాం. బడ్జెట్ దాటిపోతుండటంతో -దానికి బ్రేక్ ఇచ్చి యురేక్ చేశా. సినిమా చూసినవాళ్లంతా బావుందన్న కితాబిచ్చారు.
* ఇదొక క్రైమ్, కామెడీ థ్రిల్లర్. ఈ సినిమా నాలో కాన్ఫిడెన్స్ పెంచింది. సెకెండ్ హాఫ్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
* మేకింగ్‌లో ప్రశాంత్ బాగా హెల్ప్ చేశారు. సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. ముగ్గురి పాత్రలకూ ప్రాధాన్యముంటుంది. రాసుకున్న మంచి పాయింట్‌ను బాగా తీశాననే అనుకుంటున్నా. మార్చి 13న థియేటర్లకు వస్తున్న యురేకకు ఆడియన్స్ సపోర్ట్ కోరుకుంటున్నా.