తెలుగుపై కొత్త మోజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో మార్కెట్ పెంచుకోడానికి మలయాళ స్టార్ దుల్కన్ సల్మాన్ ఎప్పటినుంచే చూస్తున్నాడు. కెరీర్ ఆరంభం నుంచీ ఎక్కువ శాతం ద్విభాషా, త్రిభాషా చిత్రాలే చేస్తూవస్తున్న దుల్కర్ -నిజానికి తెలుగులోనే కాస్త వీక్‌గా ఉన్నారు. తమిళ, మలయాళంలో దుల్కర్ మార్కెట్ చిన్నదేం కాదు. సౌత్ హీరోగా క్రేజ్ సంపాదించాలంటే తెలుగులో మార్కెట్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుపైనా ఫోకస్ పెడతానంటూ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తోన్న దుల్కర్ -ఇప్పుడిక తెలుగు స్ట్రెయిట్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఆమధ్య ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, కొద్ది రోజుల క్రితం వచ్చిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అనువాద చిత్రమే అయినా తెలుగులో మంచి సక్సెస్ కావడంతో -ఆ క్రేజ్ ఉండగానే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలన్న ఆలోచనకు వచ్చాడట దుల్కర్. ‘అందాల రాక్షసి’తో తన ప్రతిభ చూపించిన దర్శకుడు హను రాఘవపూడికి -దుల్కర్‌తో స్ట్రెయిట్ తెలుగు సినిమా చేసే చాన్స్ దక్కిందని తెలుస్తోంది. నానితో కృష్ణగాడి వీరప్రమగాథ చిత్రం తీసి ఒకే అనిపించుకున్న హను -లై, పడి పడి లేచె మనసు చిత్రాలతో మెప్పించలేకపోయాడు. ఇప్పుడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ ప్రాజెక్టు దొరకడంతో -హను తన స్టామినా చూపించే అవకాశం దక్కినట్టే అంటున్నారు. ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న హనుకి, దుల్కర్‌కు -ఈ ప్రాజెక్టు సవాల్లాంటిదే.