మళ్లీ అలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యనుంచి సినిమా వస్తుందంటే -ఇదివరకు కనిపించేంత ఆసక్తి ఇప్పుడు లేదు. వరుసగా మూడు నాలుగు సినిమాలు ఓకే దగ్గరే ఆగిపోవడంతో -సూర్య ఇమేజ్ గ్రాఫ్ పార్లల్‌గానే సాగుతోంది. ఈ టైంలో సూర్యనుంచి వస్తోన్న చిత్రం -ఆకాశమే నీ హద్దురా. సుధ కొంగర తెరకెక్కించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ఇదొక బయోపిక్ కనుక సినిమా హిట్టయినా -సూర్య స్టార్ ఇమేజ్‌కు కలిసొచ్చేదేమీ ఉండకపోవచ్చు. తరువాతి ప్రాజెక్టుగా సూర్య -డైరెక్టర్ హరితో కాంబినేషన్ సెట్ చేశాడు. ‘అరువా’ టైటిల్‌తో రానున్న ఆ చిత్రంలో సూర్య -తనకు కలిసొచ్చిన ప్రయోగానే్న చేయనున్నాడట. ఇంతకుముందు ‘బదర్స్’ చిత్రంలో అతుక్కుని పుట్టిన కవల పాత్రలతో సూర్య ప్రయోగం చేశాడు. రెండు కోణాలున్న ఆ పాత్రలు ఆడియన్స్‌కి బాగా కనెక్టయ్యాయి కూడా. ఇప్పుడు హరితో చేయబోయే ప్రాజెక్టులోనూ -కవలలుగా ద్విపాత్రాభినయం చేయనున్నాడని తెలుస్తోంది. రెండు పాత్రల్లో ఒకటి పూర్తి పాజిటివ్ అయితే, రెండోది విలన్ షేడ్స్‌లోనే ఉంటుందని అంటున్నారు. డబుల్ డైమెన్షన్స్ క్యారెక్టర్లతో తన స్టామినా చూపించేందుకు సూర్య సిద్ధమవుతున్నాడని అంటున్నారు. సరైన హిట్టు కోసం చూస్తున్న సూర్యకు -హరితో చేయనున్న ప్రాజెక్టు పూర్వవైభవం తెస్తుందన్న నమ్మకంతో ఉన్నాడట.