స్పెషల్ అట్రాక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెబ్బాపటేల్. తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ హీరోయిన్. కుమార్ ఎఫ్21తో యూత్ మైండ్స్‌లో ఫిక్సైపోయిన హెబ్బా -ఆ తరువాత చేసిన చిత్రాలేవీ కలిసిరాలేదు. చేతిలో ప్రాజెక్టులు లేకపోయినా.. అదృష్టం ఎత్తులకు తీసుకెళ్లకున్నా.. -ఇండస్ట్రీలో హెబ్బాకు ‘రొమాంటిక్’ ఫ్యాన్స్ లేకపోలేదు. సరైన సినిమాలు పడుంటే -హెబ్బా కేరీర్ ఓ రేంజ్‌లో ఉండేదనటంలో సందేహం లేదు. అయినా.. ఏదోక రోజు నా టైం రాకపోతుందా? అన్న ఆశతో హెబ్బాపటేల్ ఏదోక పాత్రతో స్క్రీన్‌పై కనిపిస్తూనే ఉంది. చిన్నా చితకా సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే -మీడియం రేంజ్ ప్రాజెక్టుల్లో ‘సమ్‌థింగ్ స్పెషల్’గా కనిపించేందుకు సై అంటోంది. తాజాగా రామ్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తోన్న ‘రెడ్’లో ఓ ఐటెమ్ చేసిందట హెబ్బా. పాట షూట్ టైంలోనే అవ్వాక్కయ్యేంతగా హెబ్బా గ్లామర్ చూపించిందంటోంది యూనిట్. ఈ పాట తనకు కొత్త అవకాశాలు తీసుకొస్తుందన్న నమ్మకాన్ని హెబ్బా వ్యక్తం చేస్తుంటే, ఈ సాంగ్‌తో ఆమె ఐటెమ్ స్పెషలవ్వడం ఖాయమని ఇన్‌సైడర్స్ అంటున్నారు. మాళవిక శర్మ, నివేదా పెతురాజ్, అమృతా అయ్యర్‌లాంటి ముగ్గురు హీరోయిన్లు స్క్రీన్‌మీద కనిపించినా -రామ్ చిత్రంలో కమర్షియల్ రొమాన్స్ కోసమే హెబ్బాతో సాంగ్ డిజైన్ చేశారన్న మాట వినిపిస్తోంది. ఎవరేమనుకుంటే హెబ్బాకేంటి? ఏదోకవిధంగా కెరీర్ గాడిలో పడితే అదే పెద్ద స్పెషల్.