జెంటిల్‌మేన్‌ను మరిపించే ‘శక్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ హీరో శివకార్తికేయన్ తాజాగా హిట్టుకొట్టిన చిత్రం -హీరో. దర్శకుడు మిత్రన్ తెరకెక్కించిన చిత్రం గత డిసెంబర్‌లో తమిళంలో మంచి హిట్టుకొట్టింది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో ‘శక్తి’ టైటిల్‌తో ఆడియన్స్‌కి అందిస్తున్నారు నిర్మాత కోటపాడి జె రాజేష్. కేజీఆర్ స్టూడియోస్, గంగా ఎంటర్‌టైనె్మంట్స్‌పై ఈనెల 20న విడుదలవుతోంది. శివకార్తికేయన్‌తో కల్యాణి ప్రియదర్శన్ రొమాన్స్ చేస్తే -అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ కీలక పాత్రలు పోషించారు. 20న సినిమా విడదలవుతోన్న సందర్భంలో నిర్మాత కోటపాడి జె రాజేష్ మాట్లాడుతూ -సామాజిక బాధ్యతతో తీసిన చిత్రమిది. ప్రజల్లో ప్రస్తుత విద్యా వ్యవస్థపై అవగాహన కల్పించే చిత్రానికి తమిళుల మంచి ఆదరణ లభించింది. తెలుగు ప్రేక్షకులకూ నచ్చుతుందన్న ఉద్దేశంతో ‘శక్తి’ని రిలీజ్ చేస్తున్నాం. మోడ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కరెంట్ సినారియోపై డిస్కస్ చేసిన స్టోరీ ఇది. ఒకప్పుడు విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపిస్తూ చేసిన జెంటిల్‌మేన్ సెనే్సషనల్ హిట్టైంది. ఇప్పుడున్న విద్యా విధానంపై జెంటిల్‌మేన్ సినిమా తీస్తే -అది శక్తిలా ఉంటుందని అంటాను. దర్శకుడు మిత్రన్ పనితనం ‘అభిమన్యుడు’ చిత్రంతో ఆడియన్స్‌కి సుపరిచితమే. ఇక రెమో, సీమరాజా చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌నీ మెప్పించిన శక్తికార్తికేయన్ ఈ సినిమాకు ఓ స్పెషల్. అర్జున్, అభయ్ డియోల్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. అలాంటి చిత్రాన్ని మార్చి 20న ఆంధ్రలో విడుదల చేస్తున్నాం. 22నుంచీ తెలంగాణలోనూ థియేటర్లు ఓపెన్ అవుతాయని అంటున్నారు. రెండురోజులు ఆలస్యంగానైనా నైజాంలోనూ విడుదల చేస్తాం. శివకార్తికేయన్, సంతానం హీరోలుగా మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నామని, మంచి కథ దొరికితే తెలుగులోనూ సినిమా చేయాలని చూస్తున్నట్టు రాజేష్ వెల్లడించారు.