పడిపోయారుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్కింటి పిల్లలాంటి తెలుగుదనం ఉట్టిపడే పక్క రాష్ట్రాల బ్యూటీలంటే టాలీవుడ్‌కు ఎప్పుడూ మోజే. అందుకే -తెలుగు తెరపై తెలుగందాలు రాణించలేకపోతున్నాయి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు మున్నా తెరకెక్కిస్తోన్న చిత్రం -ఉప్పెన. వైష్టవ్‌తో ప్రేమ కథ నడిపించనున్న హీరోయిన్ -కృతిశెట్టి. పసినవ్వుల సొగసులో తెలుగుదనం చూపిస్తోన్న కృతిపట్ల -మేకర్లు ఆసక్తి చూపిస్తున్నట్టే కనిపిస్తోంది. ఇదీ అని చెప్పడానికి వీల్లేని అందంతో కట్టిపడేస్తోన్న కృతిశెట్టికి -చాన్స్‌లు ఇచ్చేందుకు మేకర్లు ఆకస్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పెన నుంచి విడుదలై వైరల్ అయిన -నీ కన్ను నీలి సముద్రం పాట గ్లింప్స్‌తో కుర్రకారు మతిపోగొట్టింది కృతి. అమాయకపు మోముపై ఎక్స్‌ప్రెషన్స్‌తో యువతరానికి గిలిగింతలు పెట్టేసింది. కృతిని బిగ్ స్క్రీన్‌పై చూడ్డానికి ఇండస్ట్రీ సైతం ఆసక్తిగా చూస్తోందంటే అతిశయోక్తి కాదు. ఉప్పెన విడుదల కాకముందే -టాలీవుడ్‌లో కృతిశెట్టి మరో చాన్స్ అందుకున్నట్టు తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుక్కూ శిష్యుడు సూర్యప్రతాప్ తెరకెక్కించనున్న 18 పేజీలు చిత్రంలో కృతికి బెర్త్ దొరికిందని అంటున్నారు. ఉప్పెన పాటలోని కృతి ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిన సుక్కూ, దర్శకుడు ప్రతాప్‌కు రికమెండ్ చేశాడని అంటున్నారు. ఈ సినిమాకు సుక్కూ కూడా ఒక నిర్మాత. ఈ రెండు సినిమాలతో కృతి తన స్టామినాను ప్రూవ్ చేసుకుంటే -సుకుమార్‌లాంటి స్టార్ డైరెక్టర్లు తమ తరువాతి ప్రాజెక్టుల్లో చాన్స్‌లిచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కృతి లక్ ఎంత ఫేవర్‌గా వుందో చూడాలి.