నిధి.. విధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిధి అగర్వాల్. బ్యూటిఫుల్ హీరోయిన్ మెటీరియల్. యూత్‌లో నిధికున్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. హాట్ ఫొటో షూట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న అప్‌డేట్ జనరేషన్ హీరోయిన్ కూడా. మున్నా మైఖేల్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిధి, తొలి చిత్రంలోనే గ్లామర్‌తో కట్టిపడేసింది. నాగచైతన్యతో సవ్యసాచి, అఖిల్‌తో మిస్టర్ మజ్ను సినిమాలు చేసినా -టాలీవుడ్‌లో మాత్రం సరైన గుర్తింపు రాలేదు. పూరి-రామ్ కాంబొలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్టైనా -గ్లామర్‌కు ఏమాత్రం అభ్యంతరం చెప్పని నిధికి మాత్రం ఆ సినిమా కలిసి రాలేదు. ప్రస్తుతం నిధి చేతిలో డెబ్యూ హీరో అశోక్ గల్లాతో చేయాల్సిన సినిమా ఒక్కటే ఉంది. అందం విషయంలో అంతా ఓకే అంటున్నారు కానీ, అవకాశాలు మాత్రం పిలిచి ఇవ్వడం లేదంటూ నిధి సైతం తన కెరీర్‌పై విస్మయాన్ని వ్యక్తం చేస్తోందట. తమిళం, కన్నడలోనూ నిధి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్నివ్వడం లేదట. అశోక్ గల్లాతో రూపొందే సినిమా సైతం పూర్తవుతుందో లేదోనన్న సందేహాలు తలెత్తుతుండటంతో -కెరీర్‌పై నిధిలో టెన్షన్ మొదలైందని అంటున్నారు. చాన్స్‌ల కోసం ఎలాంటి ఫొటోషూట్స్ చేస్తుందో చూడాలి.