నిర్లక్ష్యం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనమంతా బిజీ. రొటీన్ లైఫ్‌లో ఎవరి బిజీ వాళ్లది. మానవాళిని కబళించే మహమ్మారి దాడి చేస్తోందంటూ ప్రపంచ దేశాలు గగ్గోలెత్తుతుంటే -మన వరకూ వచ్చాక చూద్దాంలే అన్నంత బిజీ. నిజానికి ఈ నిర్లక్ష్యమే -ప్రాణం తీసే వైరస్ పుట్టడానికి కారణమై చైనా కొంపముంచింది. చైనానుంచి ప్రపంచం మీదకి దండెత్తిన కరోనా వైరస్ విషయంలో -ఇటలీ జనాలు చూపించిన నిర్లక్ష్యమే ఆ దేశాభివృద్ధిని పాతికేళ్ల వెనక్కిలాగేసింది. అలాంటి నిర్లక్ష్యమే ఇక్కడా చూపిస్తే -్భరత్‌కు కోలుకోలేని దెబ్బ తప్పదంటూ వైద్య నిపుణులు, ప్రభుత్వాధినేతలు, ప్రముఖులు, సెలబ్రిటీలు గొంతు చించుకుని మరీ చెప్తున్నారు. వచ్చాక చూద్దాంలే అనుకునే కంటే -మన పక్కోడికి కూడా రాకుండా చూడటమే బాధ్యతన్న విషయాన్ని గుర్తెరగాలని సూచిస్తున్నారు. ఏ ప్రమాదమైనా మనవరకూ వచ్చాక చూద్దాంలే అనుకుంటే -కళ్లు మూసి తెరిచేలోగా ముంచేసి పోతుందని గుర్తించమంటూ సెలబ్రిటీలూ పదేపదే సోషల్ మీడియా డయాస్‌పై పోస్టులు పెడుతున్నారు. ఒక్కో సెలబ్రిటీ ఒక్కో తీరులో పోస్టు పెడుతున్నా -కామన్‌గా కరోనా విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించక తప్పదన్న సూచనలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. తాజాగా -యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోన్న సమస్య కరోనా అంటూ ఇండస్ట్రీ సీనియర్ చిరంజీవి ఓ వీడియో పోస్ట్ చేశారు. మానవాళి మనుగడను భయాందోళనలకు గురి చేస్తోన్న సమస్య కరోనా. అయితే, మనకేదో అయిపోతుందన్న భయాలొద్దు. అలాగని -ఏమీ కాదులేనన్న నిర్లక్ష్యము అస్సలొద్దు. నిపుణులు సూచిస్తోన్న తగు జాగ్రత్తలతో పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాల్సిన సమయమిది. జన సమూహాలకు వీలైనంత దూరంగా ఉందాం. వైరస్ ఉధృతి తగ్గేవరకూ సాధ్యమైనంత వరకూ ఇళ్లకే పరిమితమవ్వడం ఎంతైనా ఉత్తమం. నిపుణులు సూచిస్తోన్న జాగ్రత్తలు వ్యక్తిగతంగా ప్రతిఒక్కరూ సీరియస్‌గా తీసుకోండి. వీలైనన్ని ఎక్కువసార్లు మోచేతుల వరకూ 20 క్షణాలపాటు శుభ్రంగా కడుక్కోవాలి. తుమ్మినా, తగ్గినా కర్చ్ఫీనో, టిష్యూ పేపర్‌నో అడ్డుపెట్టుకోవడం తప్పనిసరి. అలా వాడిన టిష్యూలను చెత్తబుట్టల్లోనే వేయాలి. జ్వరం, జలుబు, దగ్గు, అలసటవుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. కరోనా -మానవాళి ఎదుర్కోలేనంత భయంకర మహమ్మారి కాదు. అలాగని నిర్లక్ష్యం వహిస్తే -అదే మృత్యువుగా మారొచ్చు. కరచాలనాలను పక్కనపెట్టి -సంప్రదాయబద్ధంగా నమస్కారాలే చేద్దాం అంటూ వీడియోలో పిలుపునిచ్చారు చిరంజీవి.
ఇదిలావుంటే, దేశంలోని వినోద పరిశ్రమ మొత్తం అత్యయిక పరిస్థితిని పాటిస్తుండటంతో -సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఆసక్తులపై తీరిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తూనే -ఇళ్లకే పరిమితమైన తాము ఏం చేస్తున్నామో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ -్ఫ్యన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈకోణంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ -వైరలవుతోంది. తీరిక సమయాల్లో సంగీతంపట్ల అమితాసక్తి చూపుతానన్న విషయాన్ని గిటార్‌ను చేతిలోకి తీసుకుని మరీ చెబుతోంది కత్రినా. స్ట్రింగ్ మ్యూజిక్‌కు అనుగుణంగా వెస్ట్రన్ వోకల్ సాంగ్ ప్లే చేస్తూ -వీడియోని పోస్ట్ చేసింది. ‘ప్రాక్టీస్ బావుంది. కొద్దిరోజుల్లో మీకు వినిపిస్తా’నంటూ కామెంట్ పెట్టింది. అయితే, కత్రినా పోస్ట్ చేసిన వీడియోలో ఆడియో వినిపించకపోవడం ఓ ఫన్. అంచనాలను మించి భారత్‌లో పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో -మనకేం కాదన్న నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టాలంటూ కత్రినా సూచించింది. బయటి పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్న నేపధ్యంలో -ఇళ్లలోనే ఉంటూ మీ పనులు చక్కబెట్టుకోవచ్చు అంటూ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలూ తమ సోషల్ మీడియా పేజెస్‌లో ఫాలోవర్లకు సూచనలు చేస్తున్నారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెయింటింగ్ మీద పడ్డాడట. షూటింగ్‌లు లేకపోవడంతో -డెయిలీ యాక్టివిటీలో దొరికిన తీరికను మోనోక్రోమ్ పెయింటింగ్‌పై వెచ్చిస్తున్నానంటూ ఫ్యాన్స్‌కి ఓ ఇన్‌స్టా వీడియో పోస్ట్ చేశాడు. బ్లాక్ స్కెచ్‌తో సల్మాన్ గీసిన మోనోక్రోమ్ పెయింటింగ్ ఆసక్తి రేకెత్తిస్తోంది.