మొదలైన పాగల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విష్వక్సేన్ హీరోగా కొత్త దర్శకుడు కుప్పిలి నరేష్ తెరకెక్కించనున్న చిత్రం -పాగల్. లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ రూపొందిస్తోన్న చిత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఓపెనింగ్ సీన్‌కు హీరో రానా క్లాప్‌నివ్వగా, నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా మీట్‌లో హీరో విష్వక్సేన్ మాట్లాడుతూ -దర్శకుడు చెప్పిన కథ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అందుకే సినిమాకు ఒప్పుకున్నా. సరికొత్త జోనర్‌లో తెరకెక్కనున్న సినిమా ఇది. లాంఛనంగా సినిమా ప్రారంభించాం. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక షెడ్యూల్స్ ప్రకటిస్తాం అన్నారు. నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ -క్రేజీ సబ్జెక్టుతో రూపొందనున్న చిత్రంలో అందరికీ నచ్చే అంశాలకు కొదువలేదు. ముఖ్యంగా హీరో గ్లామర్, డైరెక్టర్ టాలెంట్ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్స్. త్వరలో షూటింగ్ విశేషాలు వెల్లడిస్తాం అన్నారు. దర్శకుడు నరేష్ మాట్లాడుతూ -విష్వక్ కెరీర్‌లోనే భిన్నమైన సినిమాగా ఆయన కెరీర్‌కు ప్లస్ పాయింట్ అయ్యే సినిమా ఇది అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు రతన్, కెమెరామెన్ మణికందన్, గ్యారీ, లతాతరుణ్ తదితరులు పాల్గొన్నారు.