మే దాటక తప్పదేమో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకలు తీరిన స్టార్ హీరోలైనా -కరోనాకు లోకువేనన్నట్టుంది సినిమాల పరిస్థితి. పొలిటికల్ ఎంట్రీ కోసం తీసుకున్న గ్యాప్ కారణంగా -పవన్ కల్యాణ్‌ని స్క్రీన్‌పై చూసి రెండేళ్లవుతుంది. 25వ ప్రాజెక్టు అజ్ఞాతవాసి తరువాత -జనసేన అధ్యక్షుడిగా బిజీ అయిపోయాడు పవన్. రాజకీయంగా అననుకూల పరిస్థితుల కారణంగా మళ్లీ మేకప్‌కు సిద్ధమై -పవన్ చేస్తున్న రీమేక్ ‘వకీల్ సాబ్’. పొలిటికల్‌గా బిజీ అవ్వాలనుకున్న పవన్ -తిరిగొచ్చి హీరోగా బిజీ అయిపోయాడు. అధికారిక, అనధికారక కథనాల ప్రకారం నాలుగైదు ప్రాజక్టుల్ని లైన్‌లో పెట్టాడు పవర్‌స్టార్. వరుస సినిమాలతో పవన్‌ను స్క్రీన్‌పై చూడొచ్చంటూ ఫ్యాన్స్ ఎగిరి గంతేసేలోగానే -కలికాలం కరోనాను మోసుకొచ్చింది. వైరస్ తీవ్రతను నిరోధించేందుకు ఇండస్ట్రీ బంద్ పాటించటంతో -దాని ఇంపాక్ట్ పవన్ సినిమాలపై బలంగానే చూపిస్తోందన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పవన్ చేస్తున్న 26వ ప్రాజెక్టు -వకీల్ సాబ్. దిల్‌రాజు, బోనీకఫూర్ నిర్మాతలుగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న చిత్రం మేలో విడుదలవుతుందనే అనుకున్నారంతా. కానీ, కరోనా ఎఫెక్ట్‌తో ‘వకీల్..’ రాక లేటయ్యేలాగే కనిపిస్తోంది. షూటింగ్‌లు బంద్ కావడంతో.. టార్గెట్ టైంలో వకీల్‌సాబ్‌ను పూర్తి చేయడం సాధ్యకాకపోవచ్చన్న మాట వినిపిస్తోంది. పింక్‌కు రీమేక్‌గా వస్తోన్న చిత్రమే అయినా -పవన్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని కమర్షియల్ ఎపిసోడ్‌ను బ్యాక్‌డ్రాప్ స్టోరీగా కలపవడంతో.. ఆ పార్ట్‌ని ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. ఇప్పటికే పవన్-క్రిష్ కాంబోలో తెరకెక్కే ప్రాజెక్టు షూటింగ్ సైతం మొదలైంది. పెద్ద నిర్మాత ఏఎమ్ రత్నం ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనిపైనా కరోనా ఎఫెక్ట్ లేకపోలేదు. దీంతో, ఇన్‌టైంలో ఏదోక ప్రాజెక్టు పూర్తి చేసే ఉద్దేశంతో.. క్రిష్ ప్రాజెక్టును తాత్కాలిక బ్రేక్ ఇద్దామంటూ పవన్ ప్రతిపాదించినట్టు కథనాలు వస్తున్నాయి. వకీల్‌సాబ్ పూరె్తైన తరువాత కొత్త ప్రాజెక్టు మొదలెడితే, పాత్రకు సంబంధించి మేకోవర్ ఇబ్బందులూ తప్పుతాయన్న ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. సో, ఎలా చూసినా వకీల్‌సాబ్ అనుకున్న టైంలో రాకపోవచ్చని, దాని ఇంపాక్ట్‌తో క్రిష్ చేస్తున్న ప్రాజెక్టు సైతం వచ్చే ఏడాది ఆరంభానికి మారినా ఆశ్చర్యపోవాల్సింది లేదన్న మాట వినిపిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులపై అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయో వేచి చూడాలి.