పాయల్ కోసం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అందం, అభినయంలో ఎలాంటి లోటూ లేకున్నా.. ఎందుకో పాయల్ రాజ్‌పుత్‌కు చెప్పుకోతగ్గ అవకాశాలు దక్కలేదు. ఆమె గ్లామర్‌ని కమర్షియల్ పాయింట్లో టచ్ చేశారే తప్ప, ఆమెలోని పెర్ఫార్మెన్స్ కోణాన్ని పూర్తిగా చూపించే పాత్రలే ఆమెకు పడలేదు. ఈమధ్య సీనియర్ హీరో వెంకటేష్‌తో వెంకీమామ చేయడంతో -సినిమా ఓకే అనిపించుకున్నా.. కుర్ర హీరోల సరసన ఆమెకు పాత్రలు లేకుండా పోయాయి. పైగా తొలి సినిమా ఆర్ఎక్స్ 100లో చేసిన పాత్ర హిట్టనిపించుకున్నా -కెరీర్‌కు బ్యాడ్‌గానే మారింది. మధ్యలో ఆమె చేసిన బోల్డ్ చిత్రాలు, స్పెషల్ సాంగ్స్ కూడా స్టేటస్వున్న హీరోయిన్గా ఆమెకు గుర్తింపు లేకుండా చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాయల్‌కు మళ్లీ ఓ సీనియర్ హీరో సరసనే చాన్స్ వచ్చిందట. బోయపాటి తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టులో -బాలయ్యతో రొమాన్స్ చేసే హీరోయిన్గా పాయల్‌ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. దర్శక హీరోల కాంబినేషన్ హిట్టుకనుక -పాయల్ సైతం భవిష్యత్ కెరీర్‌ని పక్కనపెట్టేసి ప్రాజెక్టుకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ ప్రాజెక్టు కోసం చాలామంది హీరోయిన్లకు సంప్రదించిన బోయపాటి -చివరకు పాయల్ దగ్గర ఆగాడంటున్నారు. ఈ హ్యాట్రిక్ కాంబో కనుక హిట్టయితే -పాయల్‌కు మాత్రం ఈసారి పేరు రావడం ఖాయం. కెరీర్ కొత్త టర్న్ తీసుకొవచ్చన్న నమ్మకాన్ని పాయల్ సైతం వ్యక్తం చేస్తోందట.