ఫ్రెండ్షిప్‌కొద్దీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత బావుంటేనే హీరో బావుంటాడు. చేసిన సినిమా నష్టాల్లోపడితే -మరోకోణంలో దాన్ని భర్తీ చేసుకునేందుకు హీరో అవకాశమిస్తాడు. ఇది టాలీవుడ్‌లో కనిపించే అండర్‌స్టాండింగ్ ప్రొఫెషనలిజం. ఇప్పుడు -నిర్మాత నితిన్, హీరో అఖిల్ మధ్య కూడా అలాంటి ప్రొఫెషనలిజం అండర్‌స్టాండింగ్ సెట్టయ్యిందన్న మాట వినిపిస్తోంది. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ విడుదలకు రెడీ అయ్యింది. కరోనా ఎఫెక్ట్‌తో ఇండస్ట్రీ సంప్‌లో పడటంతో, చాలా సినిమాల్లాగే -ఎంఇబి సైతం విడుదల ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది. సో, ఎంఇబితో ఫ్రీ అయిపోయిన అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్టు ప్రిపరేషన్స్‌లో ఉన్నాడట. హీరోగా తనను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ డెబ్యూ ప్రాజెక్టు చేసిన నితిన్‌తోనే నెక్ట్స్ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. నితిన్ నిర్మాతగా అఖిల్ మొదటి సినిమాను దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించాడు. ఆ సినిమా నితిన్‌కు భారీ నష్టాలే మిగిల్చింది. ఆ నష్టాలను భర్తీ చేయడానికి నితిన్ బ్యానర్లో అఖిల్ ఐదో ప్రాజెక్టుకు ఓకే చెప్పాడని, పారితోషికం తీసుకోకుండానే సినిమా చేస్తాడని అంటున్నారు. ఈ లోబడ్జెట్ ప్రాజెక్టును దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయట. ఫ్రెడ్షిప్‌కొద్దీ అఖిల్ చూపిస్తోన్న ప్రొఫెషనలిజానికి ప్రశంసించాలి.