ఎవరా సింగర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ -సింగీతం శ్రీనివాసరావు. పుష్పకవిమానం, విచిత్ర సోదరులు, ఆదిత్య 369 చిత్రాలు అందుకు ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో బాలయ్య సినిమాలు పోతున్న ప్రతిసారీ -సక్సెస్ కోసం ఆదిత్య 369 సీక్వెల్ చేయొచ్చంటూ మాట వినిపించటం మామూలైంది. తరువాత బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా సింగీతం సినిమా రూపొందించనున్నట్టూ వార్తలొచ్చాయి. కొత్తగా సింగీతాన్ని కోట్ చేస్తూ -టాలీవుడ్‌లో ఆసక్తికరమైన కథనం వినిపిస్తోంది. ఓ గాయకుడి జీవిత కథను బయోపిక్‌గా రూపొందించే ఆలోచనలో ఉన్నాడట. లెజెండరీ గాయకుడిగా గుర్తింపున్న ఆయనెవరు? అనే విషయం మాత్రం బయటకు పొక్కడం లేదు. త్వరలో సినిమాను ప్రారంభిస్తూ అధికారిక ప్రకటన వెలువడొచ్చన్న మాటా వినిపిస్తోంది. సింగీతం ఏదైనా స్క్రిప్ట్‌ని టేకప్ చేస్తున్నారంటే -దానిపై చాలామంది ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొంటుంది. జాతీయస్థాయి గుర్తింపున్న సింగీతం, ఈ బయోపిక్‌ను పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందిస్తారన్న మాటా వినిపిస్తోంది. బయోపిక్ అవుతోన్న గాయకుడెవరో తెలియాలంటే -కొంతకాలం ఆగక తప్పదేమో.