సోనాలి.. సైలెన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క తాజా బహు భాషా చిత్రం -సైలెన్స్. తెలుగులో నిశ్శబ్ధంగా రానుంది. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని కొన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. మహిళా ప్రధాన చిత్రంలో అనుష్క లీడ్‌రోల్ చేస్తుంటే -మాధవన్, అంజలి, షాలినీ పాండే కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరోనా ఇంపాక్ట్‌తో థియేటర్లు మూతపడిన కారణంగా నిశ్శబ్ధం -తదుపరి రిలీజ్ డేట్ కోసం చూస్తుండటం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి -తాజాగా చిన్న అప్‌డేట్ బయటికొచ్చింది. కీలక పాత్రలో కనిపించనున్న షాలినీ పాండే -కథకు పెద్ద ట్విస్ట్ అన్న మాట వినిపిస్తోంది. అనుష్క ఫ్రెండ్ ‘సోనాలి’గా కనిపించనున్న షాలినీ -మిస్టీరియస్ క్యారెక్టర్‌కు ప్రాణం పోసిందట. ఆమె పాత్ర ఆసాంతం ఆడియన్స్‌లో అనుమానాలు రేకెత్తిస్తుందని, పాత్రను డిజైన్ చేసిన తీరే అద్భుతమని అంటున్నారు. అందుకు తగిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన షాలిని -ఈ పాత్రతో తనేంటో ప్రూవ్ చేసుకోనుందన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే -షాలిని పంట పండినట్టే.