ఆచార్యకు కాజల్ కన్ఫర్మ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దర్శకుడు కొరటాల -మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా చూపించే పనిలో బిజీగా ఉన్నాడన్నది తెలిసిందే. ఈ ప్రాజెక్టులో చిరు ఇమేజ్ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్ కోసం కొరటాల టీం చాలా పేర్లను పరిశీలించి త్రిషను ఎంపిక చేసుకుంది. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదుకానీ -ప్రాజెక్టు నుంచి త్రిష అకస్మాత్తుగా తప్పుకోవడం తెలిసిందే. చిరుతో చేయడం లేదంటూ త్రిష తనంతట తాను ప్రకటించటం సెనే్సషనైంది. అయితే ఆ ఇంపాక్ట్ ప్రాజెక్టుపై పడకూడదన్న ఉద్దేశంతో కొత్త హీరోయిన్ ఎంపికను ముమ్మరం చేశారు. అలా -కాజల్ పేరు తెరపైకొచ్చింది. కాజల్ క్రేజ్ టాప్ రేంజ్లో లేకున్నా -చిరుకు జోడీగా ఎంపిక చేయడం చర్చకు తావిచ్చింది. కాజల్‌నే తీసుకుంటున్నట్టు మీడియా కథనాలొచ్చినా -పారితోషికాన్ని ఎక్కువ డిమాండ్ చేస్తున్న కారణంగా పునఃపరిశీలన చేస్తున్నారన్న కథనాలు వచ్చాయి. మధ్యలో -చిరు ఇమేజ్ వెయిట్‌ను బ్యాలెన్స్ చేయగల హీరోయిన్గా అనుష్కను ఎంపిక చేశారన్న కథనాలు లేకపోలేదు. ఇన్ని షార్ప్ టర్న్‌ల తరువాత -చిరు 152 ప్రాజెక్టు బోర్డ్‌లో కాజల్‌కే ప్లేస్ దక్కిందన్నది తాజా వార్త. కాజల్ స్వయంగా తన ఫ్యాన్స్‌కు ఇన్‌స్టా లైవ్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసిందన్న మాట వినిపిస్తోంది.
ప్రాజెక్టు టైటిల్ ఆచార్యగా చిరంజీవి పొరబాటున ఓ అకేషన్లో ప్రకటించటంతో -టైటిల్ మారొచ్చన్న మాటా నిన్నటి వరకూ వినిపించింది. అయితే, టైటిల్ ఆచార్య అంటూ కాజల్ సైతం తన ఇన్‌స్టాలో ఫ్యాన్స్‌కి రివీల్ చేయడాన్ని చూస్తే -అదే టైటిల్ ఉంచారన్న విషయం అర్థమవుతుంది. చిరు రీఎంట్రీ ప్రాజెక్టు ఖైదీ నెంబర్ 150లో కాజల్ జోడీ కట్టడం తెలిసిందే. ఇప్పుడు మరోసారి చిరు-కాజల్ జోడీ స్క్రీన్‌మీద కనిపిస్తారన్న మాట.