ఎన్టీఆర్‌తో వినాయక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల రూపొందించిన ‘అఖిల్’ అనుకున్న స్థాయి విజయం సాధించకపోవడంతో -వినాయక్ కాస్త వెనకబడినట్టే కనిపిస్తున్నాడు. ఇదివరకే ఆయన చిరంజీవి 150వ సినిమా చేస్తాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అఖిల్ రిజల్ట్‌తో వినాయక్‌కు మెగా కాంపౌండ్ నుండి ఎలాంటి పిలుపూ రాలేదు. దాంతో ఇప్పుడు వినాయక్ ఎవరితో సినిమా చేస్తాడా? అనే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే లేటెస్ట్‌గా వినాయక్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ అయినట్టు సినీవర్గాల బోగట్టా. ఈసారి ఆయన ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి సన్నాహాలు మొదలెట్టాడట. అఖిల్ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకోవాలని అనుకున్నా, వినాయక్ ఈ గ్యాప్‌లో ఎన్టీఆర్ కోసం కథ సిద్ధంచేసే పనిలో ఉన్నాడట! త్వరలోనే అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.