వంశీ పైడిపల్లితో మహేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారీ అంచనాల మధ్యన గత వారం విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ సినిమా అంచనాలను అందుకోలేక, అభిమానులను సైతం నిరాశపరచడంతో మహేష్ ఇకపై చేయబోయే సినిమాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సౌతిండియాలో పాపులర్ డైరెక్టర్ అయిన ఎ.ఆర్.మురగదాస్‌తో ఓ సినిమా చేసేందుకు సిద్ధమైన మహేష్, ఆ సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ‘ఊపిరి’ సినిమాతో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్న వంశీ పైడిపల్లితో మహేష్ ఓ సినిమా చేసే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ మెచ్చి, మహేష్ పూర్తి స్క్రిప్ట్ తయారుచేయమని తెలిపారట. పివిపి సంస్థ ఈ సినిమా నిర్మిస్తుందని సమాచారం. ఇక ప్రస్తుతం వంశీ పైడిపల్లి ఈ స్క్రిప్ట్‌ను పూర్తిచేసే పనిలో పడ్డారట. అంతా ఓకే అయ్యాక సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.