ఛాన్స్ వస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృష్ణాష్టమి’ చిత్రంతో తెలుగు తెరపైకి వచ్చిన కొత్త కథానాయిక నిక్కీ గల్రాని. ఒకేసారిగా తెలుగు తెరపైకి తెరంగేట్రం చేయలేదు ఈ బెంగుళూరు భామ. గత మూడు నాలుగేళ్లుగా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎడాపెడా చిత్రాల్లో నటించాకే ఆమెకు తెలుగులో అవకాశం వచ్చింది. తెలుగు మార్కెట్ పెద్దది కనుక ఇక్కడ అదృష్టాన్ని పరీక్షించుకొందామని ప్రయత్నించినా తొలి చిత్రం అనుకున్న అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆ తరువాత చేసిన ‘మలుపు’ సినిమా కూడా ఆమె కెరీర్‌కు కొత్తమలుపును ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కేవలం గ్లామర్, టాలెంట్ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని కెరీర్‌ను సాగిస్తోంది నిక్కీ గల్రాని. ఈ విషయంపై వివరణ అడిగితే, తనకు తగిన అవకాశాలు తప్పక వస్తాయి అని ఆశాభావాన్ని వ్యక్తంచేసింది. అదీ పాజిటివ్ థింకింగ్!