కలిసొచ్చిన బిచ్చగాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ చిత్రానికి ఆ పేరును పెట్టినపుడు వ్యతిరేకత వస్తుందని అనుకున్నామని, కానీ ఆ పేరే ఈ సినిమా విజయానికి పెద్ద ప్లస్‌గా మారిందని కథానాయకుడు విజయ్ ఆంటోని అన్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సప్తనా టైటస్ జంటగా శశి దర్శకత్వంలో చెదలవాడ పద్మావతి రూపొందించిన ‘బిచ్చగాడు’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగింది. తమిళంలో ఈ సినిమాను ఎంతగా ఆదరిస్తున్నారో అంతే ఆదరణను తెలుగులోనూ లభిస్తోందని, రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందని విజయ్ ఆంటోని తెలిపారు. కథను నమ్మి ఈ సినిమాను విడుదల చేశామని, తాను చేయబోయే తదుపరి చిత్రాల షూటింగ్ 50 శాతం తెలుగు రాష్ట్రాలోనే చేస్తానని దర్శకుడు శశి తెలిపారు. మానవ సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ సినిమా తెలుగుకు సూట్ అవుతుందా అనుకున్నా, కథమీద నమ్మకంతో విడుదల చేశామని, అది సంచలన విజయం సాధించినందుకు గర్వంగా వుందని ఆయన తెలిపారు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా బాగా ఆడుతోందని, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలలో రేపటినుండి థియేటర్ల సంఖ్య పెరుగుతుందని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ తెలిపారు.