చైనాలో బాహుబలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు రాజవౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా గతేడాది జూలైలో విడుదలై దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ‘బాహుబలి’, పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేదికలపై మన సినిమా మార్కెట్ పెరిగే అవకాశాలను కల్పించింది. ఆ క్రమంలోనే ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన ఇంటర్నేషనల్ వెర్షన్ పలు దేశాల్లో విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. తాజాగా ‘బాహుబలి’కి అతి పెద్ద మార్కెట్‌గా అవతరించే అవకాశంగా కనిపిస్తోన్న చైనాలో సినిమా విడుదలకు సిద్ధమైపోయింది. చైనాలో ‘బాహుబలి’ పంపిణీ హక్కులను స్వంతం చేసుకున్న ఈస్టార్స్ సంస్థ జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనాలో సినిమా రిలీజ్‌కు ఇప్పటినుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టింది. అక్కడి మీడియా సంస్థలకు చెందిన సుమారు 20మంది ప్రతినిధులను బాహుబలి టీమ్ హైదరాబాద్‌లో విందుకు ఆహ్వానించింది. ఈ సాయంత్రం ఏర్పాటు చేసిన ఈ మీట్‌లో చైనా ప్రతినిధులతో కలిసి దర్శకుడు రాజవౌళి, ప్రభాస్, రానా, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు ముచ్చటించారు. జూన్ నెలాఖరులో చైనాలో బాహుబలి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.