దుబాయ్‌లో జక్కన్న పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్ హీరోగా, మన్నార్‌చోప్రా హీరోయిన్‌గా ‘ప్రేమకథాచిత్రమ్’ తరువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం జక్కన్న చిత్రం ఇటీవలే దుబాయ్‌లోని అందమైన లొకేషన్స్‌లో జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా సాంగ్ షూటింగ్ జరుపుకుంది. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈవారంలో వైజాగ్‌లో జరిగే సాంగ్ చిత్రీకరణతో షూటింగ్ కార్యక్రమాలు పూర్తవుతుంది. రెండవ వారంలో ఆడియో విడుదలచేసి, జూలైలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత ఆర్.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. సునీల్ నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ‘జక్కన్న’ ఇటీవలే దుబాయ్‌లో సాంగ్ షూటింగ్ జరుపుకుందని, ఈవారంలోనే మరో పాట చిత్రీకరణ చేస్తామని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని అన్నారు. సునీల్ పెర్‌ఫార్మెర్స్‌లో అన్నిరకాల షేడ్స్ వుంటాయని, కామెడీ టైమింగ్‌కి డైరెక్టర్ వంశీ రాసిన సీన్‌కి థియేటర్స్‌లో క్లాప్స్ పడతాయని అన్నారు. డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్‌గా తెరకెక్కించారని, ‘ప్రేమకథాచిత్రమ్’ తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న ఈ ‘జక్కన్న’ చిత్రం అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అన్నారు. మా చిత్రంలో ఊహించని ట్విస్ట్‌లు చాలా వుంటాయని, హీరోయిన్ మన్నార్‌చోప్రా పాత్ర కూడా చాలా అందంగా తీర్చిదిద్దారని, అలాగే ప్రేమకథాచిత్రమ్‌లో సప్తగిరి ఏ రేంజిలో నవ్వించాడో ఈ చిత్రంలో దాన్ని మించి నవ్విస్తాడని, మంచి గెటప్‌లో కనిపిస్తాడని చెప్పారు. రెండవ వారంలో ఆడియో విడుదల చేసి, జూలైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అని అన్నారు.