సుమంత్ అశ్విన్ కొత్త చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రొటీన్‌కు భిన్నంగా సరికొత్త కథలను ఎంచుకొని హీరోగా నటిస్తున్న సుమంత్ అశ్విన్ మరో కొత్త చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నాడు. సురక్ష ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్, కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథాకథనాలతో సినిమా రూపొందించాలనుకున్న తమ సంస్థ ఈసారి సుమంత్ అశ్విన్‌తో ఓ మంచి చిత్రాన్ని రూపొందించనుందని తెలిపారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలతో అత్యధిక బడ్జెట్‌తో ప్రారంభిస్తున్నామని అన్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతామని ఆయన అన్నారు.