శాతకర్ణి హీరోయిన్ శ్రీయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ 100 చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఈ చిత్రంలో శాతకర్ణి భార్య వాసిష్ఠ పాత్రకు హీరోయిన్ శ్రీయను ఎంపిక చేశారు. తొలుత నయనతారను తీసుకోవాలని భావించినా, ఆమె డేట్స్ కుదరకపోవడంతో దర్శకుడు క్రిష్ శ్రీయను ఎంపిక చేసినట్లు సమాచారం. త్వరలో జరిగే మూడోషెడ్యూల్‌లో శ్రీయ షూటింగ్‌లో పాల్గొననుంది. శ్రీయ గతంలో బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో వున్న బాలకృష్ణ, ఈనెల 10న తన పుట్టినరోజు వేడుకను అభిమానులతో జరుపుకోనున్నారు. అదే రోజు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ టీజర్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అదేరోజు సినిమాలో కథానాయిక శ్రీయను ఎంపిక చేసినట్లు ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.