తెలుగు తెరపై పంజాబీ భామ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాయి భాషా కథానాయికలకు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా వెలిగిపోవాలని కోరిక వుండడం సహజమే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు భామలు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పుడు మరో పంజాబీ భామ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ‘అందాల రాక్షసి’ కథానాయకుడు నవీన్ చంద్ర, సంజీవ్‌కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘బుర్రకథ’ చిత్రంలో కథానాయికగా రోనికా సింగ్‌ను ఎంపిక చేశారు. చండీగఢ్ నుండి వచ్చిన రోనికా సింగ్ అక్కడ కొన్ని పంజాబీ చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. రమ్తజోగి చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. నిజానికి మొదట అస్నా జావేరిని కథానాయికగా తీసుకోవాలనుకున్నా, కొన్ని కారణాలవల్ల కుదరకపోవడంతో చివరికి రోనికాసింగ్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.