కథలో రాజకుమారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కథలో రాజకుమారి’. మహేష్ సూరపనేనిని దర్శకుడిగా పరిచయం చేస్తూ గతంలో ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాన్ని అందించిన మేగ్నమ్ సినీ ప్రైమ్ పతాకంపై వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ.. కార్తికేయ వంటి హిట్ చిత్రం తర్వాత మరో మంచి చిత్రాన్ని రూపొందించాలనే ఆలోచనతో ఓ విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకున్నామని, ఈ చిత్రం ద్వారా మహేష్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నామని, హీరో పాత్ర ప్రధాన ఆకర్షణగా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నమితాప్రసాద్ నటిస్తోందని అన్నారు. ఇళయరాజా సంగీతం అందించే ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఇళయరాజాతో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జయేష్‌నాయర్, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, సంగీతం: ఇళయరాజా, సహ నిర్మాత: బీరం సుధాకర్‌రెడ్డి, నిర్మాత: వెంకట శ్రీనివాస్ బొగ్గారం, దర్శకత్వం: మహేష్ సూరపనేని.