ఆదిత్యకు అంతర్జాతీయ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై బాలల చిత్రంగా రూపొందించిన చిత్రం ‘ఆదిత్య’. ‘క్రియేటివ్ జీనియస్’ ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అమెరికాలోని లాస్‌ఏంజిలిస్‌లో నిర్వహించిన జెన్రీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బాలల చిత్ర ప్రదర్శనకు ఎంపికై ఉత్తమ చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శక నిర్మాత సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ, నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ఎన్నో చిత్రాలు పోటీపడగా, చివరకు 30 చిత్రాలను ఎంపిక చేశారని, అందులో ‘ఆదిత్య’ చిత్రం మొదటిస్థానాన్ని పొందడం ఆనందంగా వుందని, నవంబర్ 14న రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్లలో ప్రదర్శించబడిన చిత్రమిదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం హోమ్ డిపార్టుమెంట్‌నుంచి ప్రత్యేకమైన నూన్‌షోకి అనుమతి లభించిందని, జూలైనుండి ఈ షోలను ప్రదర్శిస్తామని, మంచి కథతో టెక్నికల్ విలువలతో తెరకెక్కిన చిత్రమిదని అన్నారు. ప్రేమ్‌బాబు మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుందని, ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన సుధాకర్‌గారికి ధన్యవాదాలని తెలిపారు.