అందరికీ నచ్చే మీరే.. మేమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ తెలివిగల అబ్బాయికి ఓ తెలివిలేని అమ్మాయికి మధ్య జరిగే ప్రేమకథగా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన చిత్రమిదని దర్శకుడు హుసేన్‌షా కిరణ్ అన్నారు. తరుణ్‌శెట్టి, అవంతిక జంటగా నాకామా గ్రీన్ స్టూడియోస్ పతాకంపై హుసేన్‌షా కిరణ్ రూపొందించిన చిత్రం ‘మీకు మీరే మాకు మేమే’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సినిమా విశేషాలు తెలుపుతూ, కొందరి స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, ఆసక్తికరమైన కథనంతో నడిచే ఈ చిత్రంలో స్క్రీన్‌ప్లే సరికొత్తగా వుంటుందని అన్నారు. నటీనటులందరూ పాత్రలను అర్థం చేసుకుని నటించారని, ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని ఆయన వివరించారు.