తల్వార్స్ రక్తదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలసీమియా వ్యాధిగ్రస్తులకు స్వాంతనగా హైదరాబాద్ తల్వార్స్ చేస్తున్న కృషి హర్షించదగిందని నిర్మాత డి.సురేష్‌బాబు తెలిపారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధులలో ఇది ఒకటని, ఈ వ్యాధి బారిన పడినవారు మూడు వారాలకొకసారి రక్తాన్ని మార్చుకోవాలని, లేనిపక్షంలో వ్యాధి ముదిరి మరణం చేరువవుతుందని, ఆ వ్యాధిగ్రస్తుల సహాయార్థం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తల్వార్స్ నిర్వహిస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ హర్షించదగిందని ఆయన అన్నారు. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అనేకమంది సినీ ప్రముఖులు రక్తదానం చేశారు. ప్రభుత్వ సంచాలకులు రామచంద్రు, ఐ.ఎ.ఎస్, తమ్మరెడ్డి భరద్వాజ, బి.గోపాల్, లగడపాటి శ్రీ్ధర్, ఆర్.పి.పట్నాయక్, శివారెడ్డి, లోహిత్, శాని, శ్రీ్ధర్‌రావు, రచ్చరవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.