డబ్బా శీను ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమూల్య ప్రొడక్షన్స్ పతాకంపై బాబూనాయక్, కులకర్ణి మమత జంటగా రఘు పూజారి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘డబ్బా శీను’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఉదయం ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన దాసరి నారాయణరావు క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో సాగర్, ప్రతాని రామకృష్ణగౌడ్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. చలపతిరావు, కవిత, చమ్మక్ చంద్ర, ఫణి, రచ్చరవి, చిట్టిబాబు, జూ.రేలంగి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్:జె.పి.రామారావు, పాటలు:చంద్రబోస్, కందికొండ, మిట్టపల్లి సురేందర్, కాసర్ల శ్యామ్, కెమెరా:జి.ఎల్.బాబు, సంగీతం:రాక్ షకీల్, కథ:తన్నీరు పాండురంగారావు, నిర్మాత:గుర్రపు విజయకుమార్, దర్శకత్వం:రఘు పూజారి.