హీరో ఎలా అయ్యాడో ప్రేమికుడు చెబుతాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమికుడు చిత్రంలో శ్రీ పాత్రలో నటించాను. పట్నానికి వచ్చిన అతడు తన సమస్యలను ఎలా అధిగమించి హీరో అయ్యాడు అనే కథనంతో ఈ చిత్రం సాగుతుంది’ అని కథానాయకుడు మానస్ తెలిపారు. ఎస్.ఎస్. సినిమా పతాకంపై కళా సందీప్ దర్శకత్వంలో లక్ష్మీనారాయణరెడ్డి, సునీల్‌రెడ్డి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమికుడు’. మానస్.ఎస్, సనమ్‌శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో మానస్ చిత్ర విశేషాలను తెలిపారు.
బాలనటుడిగా అనేక చిత్రాల్లో నటించిన తాను, అనేక అవార్డులు తీసుకున్నానని, తొలిసారిగా ఈ చిత్రంతో సోలో హీరోగా పరిచయం అవుతున్నానని, హీరో హీరోయిన్, విలన్ల చుట్టూ తిరిగే కథనంతో ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అన్నారు. సినిమా కథ వినగానే నాకు తగ్గ కథ అనిపించిందని, ఔట్‌పుట్ కూడా బాగా వచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేశామని, ప్రస్తుతం ‘డీల్ విత్ ధనలక్ష్మి’ అనే చిత్రంలో నటిస్తున్నానని, అదేవిధంగా నక్షత్రం అనే చిత్రంలో విలన్‌గా ఓ పాత్రలో నటించడానికి ఒప్పుకున్నానని ఆయన అన్నారు.