తెలంగాణ లోగో ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షిరిడీ సాయి క్రియేషన్స్ పతాకంపై బిపిన్, శ్రీహర్ష, లయన్ ప్రధాన తారాగణంగా రూపొందించిన చిత్రం ‘బంగారు తెలంగాణా’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బిపిన్ మాట్లాడుతూ, కెసిఆర్ తెలంగాణ సాధించే క్రమంనుండి గ్రేటర్ ఎన్నికల వరకూ జరిగిన సంఘటనల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, ఈ సినిమా ఏ ప్రాంతానికీ వ్యతిరేకమైనది కాదని అన్నారు. తెలంగాణ హక్కులను సంపాదించుకున్న నేపథ్యంలో ఈ సినిమా వుంటుందని, షూటింగ్ పూర్తిచేశామని తెలిపారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తామని, మొదటిగా పది జిల్లాలలో విడుదల చేసే ఈ చిత్రానికి ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సినిమాను బిపిన్ అన్నీ తానై రూపొందించాడని, బంగారు తెలంగాణ దిశగా ప్రభుత్వం వెడుతున్న నేపథ్యంలో ఈ సినిమా విజయవంతం అవుతుందని ప్రతాని రామకృష్ణగౌడ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:మధు ఎ.నాయుడు, ఎడిటింగ్:నాగిరెడ్డి, కథ, మాటలు, పాటలు, సంగీతం, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:బిపిన్.
నాగశౌర్య, నిహారిక జంటగా టివి9 సమర్పణలో మధురా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీ్ధర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఒక మనసు’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య చిత్ర విశేషాలను వివరించారు.