అంజలి ప్రేమాయణం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులోకంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి ఈమధ్య టాలీవుడ్‌లో కూడా మంచి ఇమేజ్ దక్కింది. వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న అంజలి, ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చిత్రాంగద’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం కోలీవుడ్‌లో అంజలిపై ఓ న్యూస్ జోరుగా ప్రచారం సాగుతోంది. అంజలి ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఆ వార్తల సారాంశం. వివరాల్లోకి వెళితే, ఈమధ్యే ఓ యువ హీరోతో అత్యంత సన్నిహితంగా వుంటోందని, అతనితో ప్రేమలో కూడా పడిందని వార్తలొస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అన్నట్టు వీరిద్దరూ కలిసి నటించిన సినిమా కూడా సూపర్‌హిట్ అవ్వడం విశేషం.