యధార్థ ఘటనతో రోజులు మారాయి... దర్శకుడు మురళీకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతి టాకీస్ బ్యానర్‌లో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్స్‌పై రూపొందుతున్న చిత్రం ‘రోజులు మారాయి’. మారుతి కథ, స్క్రీన్‌ప్లే అందించగా మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. జె.బి. సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్ర ఆడియో విడుదల చేశారు. రాజు తొలి సీడీని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ‘మారుతివల్ల ఈ సినిమాకు నేను సమర్పకుడిగా వ్యవహరించా. సినిమా కంప్లీట్ అయిన తర్వాత ఇటీవల చూశాను. మారుతి నాకేదైతే చెప్పాడో దర్శకుడు అది తెరపై చూపించాడు. నటీనటులందరూ చాలా బాగా నటించారు. జెబి పాటలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. జూలై 1న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం’ అని అన్నారు.
దర్శకుడు మురళీకృష్ణ మాట్లాడుతూ, రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్ర కథ రూపొందిందని అన్నారు. మారుతి మాట్లాడుతూ, ‘ఒక ఆర్టికల్ నుండి పుట్టిన కథ ఇది. దర్శకుడు చాలా బాగా ఎడాప్ట్ చేసుకుని చక్కటి సినిమాగా మలిచారు. కథ రాసుకున్న దానికంటే కూడా చాలా బాగా తీసారు. నటీనటులందరూ చాలా బాగా నటించారు. నిర్మాతకు ఈ సినిమా మంచి పేరు తెస్తుంది’ అని చెప్పారు.