బాబు బంగారం పాటలు వస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఒక్క పాట మినహా టాకీపార్ట్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ, ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశామని, ఆడియోను వచ్చే నెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులనుండి ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి ఆదరణ లభిస్తోందని, నవ్వుల పంటలా రూపొందిన ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంటుందని వారు తెలిపారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళీశర్మ, వెనె్నల కిశోర్, మున్నా వేణు, గిరిధర్, అనంత్, రాజా రవీందర్, రజిత, గుండు సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మారుతి.