ప్లాటినమ్‌లో శ్రీమతి బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రిషి, రాజీవ్ కనకాల, ప్రియాంక, వృషాలి హీరోహీరోయిన్లుగా వినయ్‌బాబు దర్శకత్వంలో శ్రీ మహేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై కొత్త సత్యనారాయణరెడ్డి, చెన్న శ్రీనివాసులు నిర్మిస్తున్న చిత్రం ‘శ్రీమతి బంగారం’. ఈ చిత్రంలోని పాటలు మంచి హిట్ అవ్వడంతో శనివారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ టైటిల్ బాగుందని, ఈ సినిమా పాటలు కూడా మంచి హిట్ అవ్వడం ఆనందంగా వుందని, అన్ని రకాల కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన సినిమా ఇదని అన్నారు. విడుదల విషయంలో ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. హీరో రిషి మాట్లాడుతూ ఇదొక మంచి కుటుంబ కథా చిత్రమని, దాంతోపాటు సస్పెన్స్, థ్రిల్లర్, కామెడీ అన్ని అంశాలు ఉంటాయని, చాలా రోజుల తర్వాత నా తెలుగు సినిమా విడుదలవుతుంది అన్నారు. శోభారాణి మాట్లాడుతూ మంచి టైటిల్, మంచి పాటలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందని, ఈ టీమ్ అందరికీ ఆల్‌ది బెస్ట్ అన్నారు. రిషాలి మాట్లాడుతూ ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ జరుపుకోవడం ఆనందంగావుందని, సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది అని అన్నారు.