ప్రియాంకా.. మజాకా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ సరసన హీరోయిన్‌గా నటించే అవకాశంకోసం చాలామంది హీరోయిన్లు పరితపిస్తుంటారు. అలాంటిది అవకాశం వచ్చినా కూడా ఈ హీరోయిన్ మాత్రం భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చాంశనీయంగా మారింది. ఈ పాత్ర చేయడానికి ఏకంగా 20 కోట్లు కావాలని, లేదంటే చెయ్యనని ఖరాఖండిగా చెప్పిందట గ్లామర్ భామ ప్రియాంక చోప్రా. ఈమధ్యే హాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించిన ప్రియాంకకు కాస్త బెట్టు ఎక్కువైనట్టుంది. ఇప్పటివరకు ఏ హిరోయిన్‌కు బాలీవుడ్‌లో ఇవ్వని రెమ్యునరేషన్‌ను షారుఖ్ సినిమాకు అడగడం సంచలనం క్రియేట్ చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే షారుఖ్ హీరోగా రూపొందిన డాన్, డాన్-2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా రూపొందే డాన్-3 చిత్రంకోసం ప్రియాంకను అడిగారట. గత రెండు చిత్రాల్లో కూడా ప్రియాంకనే నటించింది. ఈ సినిమాలో నటించేందుకు దర్శకుడు పర్హాన్ అక్తర్‌ని 20 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో ఈ దర్శకుడు షాకయ్యాడని తెలిసింది.