మరోసారి ఖుషీ చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రం గుజరాత్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఏకధాటిగా జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా తరువాత పవన్‌కళ్యాణ్ నటించే సినిమాపై అప్పుడే ఊహాగానాలు జోరందుకున్నాయి. పవన్‌కళ్యాణ్ తదుపరి చిత్రం తమిళ దర్శకుడితో వుంటుందని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అప్పట్లో పవన్‌కళ్యాణ్‌తో ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సూర్య ఇటీవలే ఆయనతో చర్చలు జరిపినట్టు తెలిసింది. వీరిద్దరి కలయికలో రూపొందిన మరో చిత్రం ‘పులి బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని నమోదు చేసుకుంది. మళ్లీ చాలాకాలం తరువాత పవన్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు సూర్య. ప్రస్తుతం కథను రెడీ చేసుకోమని చెప్పారు పవన్‌కళ్యాణ్. మరి వీరిద్దరి కలయికలో రూపొందే సినిమా అభిమానులను ఖుషి చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక వార్తలు వెలువడనున్నాయి.