ముద్దు భలే కాస్ట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ హీరోయిన్ నయనతారకు ఈమధ్య కోలీవుడ్‌లో క్రేజ్ ఎక్కువైంది. ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తూ ఇతర భాషల్లో చేయడానికి డేట్స్ లేనంతగా బిజీగా మారింది. మరోవైపు సెలక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె ఓ సినిమాలో లిప్‌లాక్‌కోసం అదనంగా డిమాండ్ చేయడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చకు దారితీసింది. ఇప్పటికే రెమ్యునరేషన్ పరంగా కోటికి పైగా వసూలుచేస్తున్న ఈ భామ లిప్‌లాక్ సన్నివేశంకోసం అదనంగా వసూలుచేయడంతో అందరూ అవాక్కయ్యారట. మరోవైపు గ్లామర్‌ను పెంచి బికినీలు, రొమాంటిక్ సీన్స్ వంటివి కూడా చేయడానికి ఫిక్స్ అయ్యిందట. తాజాగా నయనతార శింబుతో కలిసి నటిస్తున్న ఓ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో లిప్‌లాక్‌కోసం నయనతారను అడిగితే అదనంగా అరకోటి డిమాండ్ చేసిందట. అదిఇస్తే తప్ప చేయనని చెప్పడంతో దర్శక, నిర్మాతలు సరేనన్నారని ఈ సిన్ చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం! అయితే ఈ లిప్‌లాక్ సన్నివేశం చేసేది ఎవరితోనో కాదు ఆమె మాజీ ప్రియుడు శింబుతో? గతంలో ఇతగాడితో ప్రేమాయణం నడిపిన నయనతార ఆ తర్వాత విడిపోయింది. అసలు శింబుతో సినిమా చేయదని అనుకున్నవారందరికీ షాక్ ఇస్తూ అతనితో సినిమాకు ఒప్పుకుంది. తాజాగా శింబుతో లిప్‌లాక్ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది.