మెగా జోడీ ఈమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ కత్తి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా బాలీవుడ్ గ్లామర్ భామ నర్గీస్ ఫక్రీ పేరు వినిపిస్తోంది. నర్గీస్ ఇప్పటికే బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మెగాస్టార్ పక్కన నటించే హీరోయిన్ బాలీవుడ్ హీరోయిన్ అయితేనే బావుంటుందని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెతో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో ఇందులో గ్లామర్ హీరోయిన్ అయితేనే బావుంటుందనే ఉద్దేశంతో ఆమెను ఎంపిక చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. మొత్తానికి త్వరలోనే హీరోయిన్‌పై ఓ ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

చిత్రం నర్గీస్ ఫక్రీ