తెలుగులో క్వీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన సినిమా ‘క్వీన్-2014’లో విడుదలైన ఈ సినిమాకుగానూ కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకూడా సొంతం చేసుకున్నారు. ఇక హిందీలో ఈ సినిమా విడుదలైనప్పట్నుంచే తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానుందని ప్రచారం జరిగినా ఇప్పటికీ ఆ రీమేక్ పట్టాలెక్కలేదు. తెలుగు రీమేక్ కోసం నయనతార, నిత్యామీనన్, సమంత.. ఇలా చాలా పేర్లే వినిపించినా ఏదీ ఖరారుకాలేదు. ఇక తాజాగా సమాచారాన్నిబట్టి చూస్తే ‘క్వీన్’ రీమేక్ త్వరలోనే పట్టాలెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్దికాలంగా లేడీ ఓరియంటెడ్ తరహా సినిమాలు చేయాలని కోరుకుంటూ వస్తోన్న త్రిష ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమయ్యే ఈ సినిమాకు ప్రముఖ నటి రేవతి దర్శకత్వం వహించనున్నారు. త్యాగరాజన్ నిర్మించనున్న ఈ సినిమాకు సుహాసిని స్క్రిప్ట్ సమకూర్చడం విశేషంగా చెప్పుకోవాలి.