త్వరలో అంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేష్మీగౌతమ్, చరణ్‌దీప్ ప్రధాన తారాగణంగా చరణ్ క్రియేషన్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో జి.ఎస్.ఎస్.పి. కళ్యాణ్ రూపొందించిన చిత్రం ‘అంతం’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం గూర్చి కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు సస్పెన్స్ థ్రిల్లర్స్‌లో ఓ సరికొత్త కథనాన్ని జోడించి, ఈ చిత్రాన్ని రూపొందించామని, సెన్సార్‌వారు సినిమాను చూసి మెచ్చుకున్నారని అన్నారు. రేష్మీ గౌతమ్ ఈ చిత్రంలో గ్లామర్‌తోపాటు అద్భుతమైన నటన ప్రదర్శించిందని, సినిమా చూశాక ఆమె గురించి చర్చ తప్పక వస్తుందని అన్నారు. థ్రిల్స్ కాకుండా అన్ని రకాల రసాలు ఈ చిత్రంలో ఉన్నాయని, ప్రతి సన్నివేశం హైలెట్‌గా సాగుతుందని అన్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. వాసుదేవ్, సుదర్శన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్జ్, కెమెరా, ఎడిటింగ్, వి.ఎఫ్.ఎక్స్, డి.ఐ., కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్.