బిచ్చగాడు హిట్ నమ్మలేని నిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ చిత్రం ఇంత గొప్ప విజయం సాధించడాన్ని నమ్మలేకపోతున్నానని, ఈ సినిమా ఇంత గొప్పగా విజయవంతం కావడానికి ఆరుగురు కారణమని హీరో, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని తెలిపారు. తిరుమల తిరుపతి వేంకటేశ్వర ఫిలింస్ పతాకంపై విజయ్ ఆంటోని, సత్తనా టైటస్ జంటగా ఫాతిమా ఆంటోని రూపొందించిన చిత్రం ‘బిచ్చగాడు’. ఈ చిత్రాన్ని తెలుగులో చదలవాడ తిరుపతిరావు తెలుగులో అందించారు. ఈ చిత్రం 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్ అర్థశతదినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా సెనే్సషనల్ హిట్ కావడం చాలా ఆనందంగా వుందని, తాను తీసిన ‘యమలీల’ చిత్రంతో పోలుస్తున్నారని తెలిపారు. ఈ సినిమా తెలుగులో ఇంత గొప్పగా విజయం సాధిస్తుందని తాను అనుకోలేదని, ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించలేకపోయాననే అనుకుంటున్నానని, ఈ సినిమా వంద రోజుల వేడుక కూడా జరుపుకోవాలని నటి జయసుధ అన్నారు. కార్యక్రమంలో అల్లాణి శ్రీ్ధర్, అజయ్‌కుమార్, శివబాలాజీ, బి.గోపాల్, ప్రసన్నకుమార్, సతీష్ పాల్గొన్నారు.