పనితోనే ప్రశాంతత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోకనాయకుడు కమల్‌హాసన్ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన శ్రుతిహాసన్ తనదైన స్టైల్‌లో సినీ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా సైమా అవార్డుల వేడుకలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటనకుగాను ఉత్తమనటి అవార్డును కూడా అందుకుంది. కెరీర్ మొదట్లో ఐరన్‌లెగ్‌గా ముద్రపడినా ‘గబ్బర్‌సింగ్’ పవర్‌ఫుల్ హిట్‌తో గోల్డెన్ గాళ్‌గా మారిపోయింది. వరుస ఆఫర్లతో క్రేజీ స్టార్‌గా ఎదిగింది. శ్రుతిహాసన్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని ట్విట్టర్‌లో తన అభిమానులతో పంచుకుంది. తనకు ఎప్పుడూ పనిచేస్తూ బిజీగా వుండడమే ఇష్టమని, అలా పనిచేయకుంటే వెంటనే సిక్ అవుతానని అంటోంది. తనను ఆరోగ్యంగా, అందంగా వుంచుతోంది తన పనేనని అంటోంది. ప్రస్తుతం శ్రుతిహాసన్ తన తండ్రి కమల్‌హాసన్ దర్శకత్వం వహిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంలో నటిస్తోంది.