9న బాబు బంగారం సింగిల్ ట్రాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మారుతి ద దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్‌ను ఈనెల 9న విడుదల చేయనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, వెంకటేష్, నయనతారల కాంబినేషన్‌పై క్రేజ్ బాగా వుందని, దానికి మారుతి దర్శకుడనగానే ఆ క్రేజ్ రెట్టింపు అయిందని అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి లుక్, టీజర్ విపరీతంగా అన్ని వర్గాల ప్రేక్షకులనుండి పాజిటివ్ స్పందన లభించిందని, ఈ చిత్రానికి సంబంధించిన సింగిల్ ట్రాక్‌ను ప్రేక్షకుల ముందుకు ఈనెల 9న తీసుకురానున్నామని, ఆడియోను కూడా త్వరలో విడుదల చేస్తామని అన్నారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, జయప్రకాష్, రఘుబాబు, బ్రహ్మాజీ, సంపత్, మురళీశర్మ, వెనె్నల కిశోర్, గిరిధర్, అనంత్, రజిత, గుండు సుదర్శన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:జీబ్రాన్, ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:మారుతి.