నాయకి వస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష ప్రధాన పాత్రలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై గోవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి, పద్మజ మామిడిపల్లి రూపొందించిన ‘నాయకి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 15న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని మొదట 8న విడుదల చేయాలనుకున్నా, తమిళంలో ఎదురైన సాంకేతిక కారణాలవల్ల రెండు భాషల్లోనూ 15న విడుదల చేయడానికి నిర్ణయించామని, ఈ సినిమాకు సంబందించిన టీజర్‌కు, ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ముఖ్యంగా త్రిష పాడిన పాటకు ఆదరణ బాగా వుందని అన్నారు. విభిన్నమైన నటనతో త్రిష ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, 45 నిమిషాల గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని వారన్నారు. హారర్ జోనర్‌లో సరికొత్త రకమైన కథనంతో రూపొందిన ఈ చిత్రంలో త్రిష పాత్రలో విభిన్న కోణాలు వుంటాయని దర్శకుడు గోవి అన్నారు. గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవీ, సత్యం రాజేష్, జయప్రకాష్, సుష్మారాజ్, కోవై సరళ, మనోబాల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రఘు కుంచె, కెమెరా:జగదీష్ చీకటి, పాటలు:్భస్కరభట్ల, దర్శకత్వం:గోవి.