అభినేత్రికి అతిథిగా శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవ, తమన్నా జంటగా ఎం.వి.వి. సినిమా పతాకంపై విజయ్ దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ రూపొందిస్తున్న చిత్రం ‘అభినేత్రి’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్టు 15న విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీదేవి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ, 70 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు భాషల్లో లావిష్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, పాటలన్నీ బాగా వచ్చాయని తెలిపారు. అభినేత్రిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని పొందిన ఆలిండియా సూపర్‌స్టార్ శ్రీదేవిని ఈ కార్యక్రమానికి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.